మోడీ హయాంలో ఆరో వికెట్!

modi
యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా నియమించబడిన గవర్నర్లను తొలగించాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఫలిస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇప్పటివరకు ఆరుగురు గవర్నర్లు వివిధ కారణాలతో రాజీనామా చేశారు. మరికొందరు లైన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా నాగాలాండ్ గవర్నర్ పురుషోత్తమన్ కూడా రాజీనామా చేశారు. అయితే తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే మిజోరాం నుంచి నాగాలాండ్ కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.


గుజరాత్ గవర్నర్ గా ఉన్న కమలా బేణీవాల్ ను మిజోరాంకు బదిలీ చేశారు. ఈమె గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో గవర్నర్ తో చిన్నపాటి యుద్ధమే జరిగింది. కమలాబెన్ పదవీకాలం 4 నెలలే ఉన్నా మిజొరాం గవర్నర్ గా బదిలీ చేశారు. ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్ గఢ్ గవర్నర్ శేఖర్ దత్ అందరికంటే ముందే రాజీనామాలు చేశారు. ఇక కేరళ గవర్నర్ గా ఉన్న షీలా దీక్షిత్ ప్రధాని మోడీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన తర్వాత తన రాజీనామా వారు కోరలేదని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. 

ఇక అగస్టా వెస్ట్ లాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసు విషయంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. అయితే ఆయన మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రాజీనామా చేసే వారిలోనరసింహన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో శ్రీకృష్ణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న వీకే దుగ్గల్ ఏపీ, తెలంగాణ గవర్నర్ గా నియమించబడతారని ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment