ముందుకు కదలనున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు?

metro-ghmc 

ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలిపెట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నగరంలోని చారిత్రక ప్రదేశాల్లోఅక్కడి కట్టడాలు దెబ్బతినకుండా భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


అయితే అది సాధ్యపడదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చెప్పడంతో మెట్రో పనులు ఆగిపోతాయని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెట్రో పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ మంగళవారం సచివాలయంలో మెట్రో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకి రానప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భూగర్భ మెట్రో మార్గానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను, అలాగే దీనిపై నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని కేసీఅర్ అధికారులని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకం కాదని, దీనిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కేసీఅర్ హామీ ఇచ్చిన్నట్టు సమాచారం. ఇక ఈ మెట్రో పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో వేచి చూడాలి.

‘జనసేన’ ప్రకటన ‘జగన్ సాక్షి’కి సమాధానమా?

pawan-kalyan-janasena

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సినీ రంగ ప్రభావం దెబ్బతినకుండా, రాజకీయ భవిష్యత్ ను కాపాడుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆ పార్టీ విడుదల చేసిన మీడియా ప్రకటన కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ ప్రకటనలో జనసేన పేరును కానీ, పవన్ కళ్యాణ్ పేరును కానీ దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు వెలువరిస్తే అందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఎన్నికల సంఘం నుంచి పార్టీకి గుర్తింపు అందిన వెంటనే పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేసి, ఆ పార్టీల విజయం లో తన వంతు పాత్ర పోషించారు. ప్రచారం లో ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీఆర్ఎస్, వైసీపీ లపై నిప్పులు చేరిన పవన్, టీడీపీ, బీజేపీ లు అధికారం లోకి వచ్చిన ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రశ్నిస్తానంటూ కూడా తెలిపారు. పవన్ ప్రచారం చేసిన ఎన్డీఎ అధికారం లోకి రాగానే ధరలు పెంచడం తో ఈ అంశాన్ని జగన్ కు చెందిన సాక్షి ప్రస్తావించింది. దీంతో జగన్ కు చెందిన సాక్షికి సమాధానంగా గురువారం జనసేన పార్టీ ప్రకటన వెలువరించిందని, అంతేకాకుండా పార్టీ కి ఈసీ గుర్తింపు వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం ద్వారా తాను ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని పవన్ చెప్పినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవన్ పలు సినిమాలలో బిజీగా ఉండగా , త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మద్దతుతో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం.

మోడీ హయాంలో ఆరో వికెట్!

modi
యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా నియమించబడిన గవర్నర్లను తొలగించాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఫలిస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇప్పటివరకు ఆరుగురు గవర్నర్లు వివిధ కారణాలతో రాజీనామా చేశారు. మరికొందరు లైన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా నాగాలాండ్ గవర్నర్ పురుషోత్తమన్ కూడా రాజీనామా చేశారు. అయితే తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే మిజోరాం నుంచి నాగాలాండ్ కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.


గుజరాత్ గవర్నర్ గా ఉన్న కమలా బేణీవాల్ ను మిజోరాంకు బదిలీ చేశారు. ఈమె గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో గవర్నర్ తో చిన్నపాటి యుద్ధమే జరిగింది. కమలాబెన్ పదవీకాలం 4 నెలలే ఉన్నా మిజొరాం గవర్నర్ గా బదిలీ చేశారు. ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్ గఢ్ గవర్నర్ శేఖర్ దత్ అందరికంటే ముందే రాజీనామాలు చేశారు. ఇక కేరళ గవర్నర్ గా ఉన్న షీలా దీక్షిత్ ప్రధాని మోడీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన తర్వాత తన రాజీనామా వారు కోరలేదని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. 

ఇక అగస్టా వెస్ట్ లాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసు విషయంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. అయితే ఆయన మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రాజీనామా చేసే వారిలోనరసింహన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో శ్రీకృష్ణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న వీకే దుగ్గల్ ఏపీ, తెలంగాణ గవర్నర్ గా నియమించబడతారని ప్రచారం జరుగుతోంది.

మోడీకి మరో పదవి

narendhra-modi 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరో పదవి అందివచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ వ్యవహరించనున్నారు. ఈమేరకు పార్టీ ఆయనను ఉభయ సభల్లో నేతగా నియమించింది. లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా రాజ్‌నాథ్‌సింగ్, రాజ్యసభలో ఉపనేతగా అరుణ్‌జైట్లీ నియమితులయ్యారు. బీజేపీపీ నేతగా ఎన్నిక కావడంతో పార్టీ మోడీకి అభినందనలు తెలిపింది.

మరోసారి గెడ్డంతో నటించనున్న పవన్ కళ్యాణ్

‘పంజా’ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకి గెడ్డంతో దర్శనమిచ్చాడు. ఆ సినిమా చివరికి ఫ్లాప్ గా నిలిచింది. అలా సినిమా అంతా గెడ్డంతో కనిపించడం పవన్ అభిమానులకు రుచించలేదు. దాదాపు టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో సినిమా అంతా అంత గెడ్డంతో నటించలేదు.


ఇప్పుడు ‘గోపాల గోపాల’ సినిమా కోసం పవన్ మరోసారి గెడ్డంతో నటించనున్నాడు అని సమాచారం. కృష్ణుని వేషం వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిపై అభిమానులు కలవరపడుతున్నట్లు సమాచారం. పవన్ బయట కూడా తరచూ గెడ్డంతోనే కనిపిస్తున్నాడు

కాబట్టి ఇప్పటికి ఈ సినిమా హాట్ టాపిక్ ఏమిటంటే పవన్ గెడ్డంతో కనిపించానున్నాడా లేక క్లీన్ లుక్ తో అలరించనున్నాడా?? ఈ సినిమాకు డాలీ దర్శకుడు. వెంకటేష్ ప్రధాన పాత్రధారి

రాజమౌళికి నో చెప్పిన సమంత


రాజమౌళికి నో చెప్పిన సమంత 
 అగ్రదర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ కథానాయికైనా కళ్లుమూసుకుని ఒప్పేసుకుంటుంది. కానీ సమంత దారే వేరు. టాలీవుడ్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను ఆమె వదులుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో ప్రత్యేక పాత్ర కోసం సమంతను రాజమౌళి అడిగారట. అయితే డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పింది.
ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్వీట్ చేశారు. 'సమంత ఇలా చేశావేంటి. నా సినిమాలో ప్రత్యేక పాత్ర చేయమని స్వయంగా నేడు అడిగితే డేట్స్ ఖాళీ లేవని చెప్పావు. నీ అభిమానులు నా మీద కోపగించుకునేలా చేశావు' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.


సమంత ఇంతకుముందు రాజమౌళి 'ఈగ'లో నటించి ప్రశంసలందుకుంది. అయితే తాజాగా రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను సమంత వదులుకోవడం పట్ల ఆమె అభిమాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో సమంత నటించిన అల్లుడుశీను' విడుదలకు సిద్దంగా ఉంది.

'తిక్కరేగింది' బన్నికా? రవితేజకా?

తన మొదటి సినిమా  'కందిరీగ'తోనే సంతోష్ శ్రీనివాస్ మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.  ఛాయాగ్రాహకుడు శ్రీనివాస్ దర్శకుడుగా మారి తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తన మార్కులో జూనియర్ ఎన్టీఆర్ తో 'రభస' చేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి చిత్రం తరువాత కొంత గ్యాప్ వచ్చినా తన రెండవ చిత్రం ఎన్టీఆర్ లాంటి హీరోతో మంచి కసితో చేస్తున్నాడు. ఒక పక్క రభస చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే మరో పక్క 'తిక్కరేగింది' అంటూ హడవిడి చేస్తున్నాడు.

'తిక్కరేగింది' బన్నికా? రవితేజకా?
'తిక్కరేగిందంటే నేను మామూలు మనిషిని కాదు' అని కొందరు కాస్త పొగరు, కాస్త గర్వంగా  అంటూంటారు. ఇప్పుడు అదే 'తిక్కరేగింది' అనే టైటిల్ తో సంతోష్ శ్రీనివాస్ ఓ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.  ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ పెద్ద బ్యానర్ సిద్దమైనట్లు సమాచారం. అయితే ఇందులో హీరో మాస్ మహారాజు రవితేజ గానీ, స్టైలిష్ స్టార్ బన్నీ గానీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికి తిక్కరేగుతుందో వేసి చూడాలి.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో రభస షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటించారు. ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది.  ఆగష్ట్‌ 14న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రభస చేయనుంది. ఈ సినిమాను హిట్‌ చేయాలని శ్రీనివాస్, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా పని చేశారు. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో అవన్నీ మా సినిమాలో ఉన్నాయని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో శ్రీనివాస్ కు టాలీవుడ్ లో  వరస ఆఫర్స్ వస్తున్నాయి.

రవితేజ సైతం సంతోష్‌ శ్రీనివాస్‌తో సినిమా చేయటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. 'తిక్కరేగింది' లేక 'తిక్కరేగితే' అనే సినిమా విషయమై అల్లు అర్జున్ తో కూడా శ్రీనివాస్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ మూవీలో హీరోగా బన్నీ నటిస్తాడా? లేక రవితేజ చేస్తాడా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.